ఆర్ముర్, శుక్రవారము 10 మే HTV న్యూస్
బిడ్డకు జన్మనిచ్చిన కొద్దిసేపటికి బాలింత మృతి చెందిన ఘటన ఆర్మూర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం ఆకులూరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన సుమలత వయస్సు 25 సంవత్సరాలు గురువారం రాత్రి ఆర్మూర్ లోని తిరుమల ఆసుపత్రిలో చేరింది. కాగా రాత్రి రెండు గంటల సమయంలో మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే కొద్దిసేపటి తర్వాత సుమలత కుట్ల వద్ద నొప్పిగా ఉందని డాక్టర్లకు చెప్పగా వైద్యులు ఇంజక్షన్ ఇచ్చారు. కాసేపటికి సుమలత మరణించింది. వైద్యుల నిర్లక్ష్యం వలన సుమలత మరణించింది అని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రి ఎదుట కుటుంబ సభ్యులు బంధువులు ఆందోళన దిగారు. ఆర్మూర్ ఏసీపి బస్వా రెడ్డి, సి ఐ రవి కుమార్, ఎస్సై అంజమ్మ సిబ్బందితో కలిసి ఆసుపత్రికి చేరుకొని బాధితులకు సముదాయించే ప్రయత్నం చేశారు.
