హెచ్ టీవీ న్యూస్ ఆర్మూర్ ప్రతినిధి జూలై 20 (ఆర్మూర్): రోజు రోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ఇంటి నుండి బయటకు వెళ్ళినవారు క్షేమముగా తిరిగి వస్తారని నమ్మకం లేదు. ఎవరు, ఎప్పుడు, ఎక్కడ ఎలా దీని బారిన పడతారో తెలియదు. చెయ్యని నేరానికి శిక్షగా నిండు సూరేళ్ళు జీవితాలను కోల్పోతున్న వారు ఎందరో! తీరని శోకంతో విలపిస్తున్న కుటుంబాలు ఎన్నెన్నో! రోడ్డు ప్రమాదాలలో ఎంతో యువశక్తి అర్ధాంతరంగా నశించిపోతుంది. సమాజానికి ఉపయోపడే మేధావుల నుండి అణ్యం-పుణ్యం ఎరుగని చిన్నారులను సైతం రోడ్డు ప్రమాదాలు నిముషాలలో మింగేస్తున్నాయి.. కనుక అందరూ చైతన్యవంతులు కండి ! ప్రమాదాలు నివారించండి.
- రోడ్డు ప్రమాదాలలో బిడ్డల్ని కోల్పోతున్న తల్లిదండ్రులు, తల్లిదండ్రుల్ని కోల్పోతున్న బిడ్డలు.
- భర్తల్ని కోల్పోతున్న భార్యలు, భార్యల్ని కోల్పోతున్న భర్తలు, అస్తుల్ని కోల్పోతున్న బంధుమిత్రులు.
- మొత్తం కుటుంబాన్నే కోల్పోయి ఒంటిరిగా మిగులుతున్న అభాగ్యులు ఎందరో!
అందుకే స్పందించండి ప్రతి ఒక్కరూ! - రోడ్డు ప్రమాదాల బారిన పడకండి- మీ కుటుంబానికి జీవితాంతం తీరని శోకం మిగల్చకండి.
- రోగాలు హెచ్చరించి మరీ చంపుతాయి. ప్రమాదాలు అకస్మాత్తుగా ప్రాణాలు తీస్తాయి.
ఒక చిన్న నిర్లక్ష్యం నిండు ప్రాణాలను ఐతిగొంటుంది. ఒక జాగ్రత్త పాటించకపోవడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా 34 లక్షల మంది ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని ఐక్యరాజ్యసమితి (యు ఎన్) తమ అధ్యయనంలో అంచనా వేసింది. మరి, ఆ చిన్న జాగ్రత్త ఏమిటో తెలుసా ‘హెల్మెట్’ ధారణ, ప్రపంచంలో జరుగుతున్న వివిధ ప్రమాదాల్లో అత్యధికులు మోటార్ సైకిలిస్టులే ఉంటున్నారని (UN) స్టడీ పేర్కొంది. హెల్మెట్ ధరించకపోవడం వల్ల 2009 నుండి 2020 లోపు దాదాపు 34 లక్షల మంది మరణిస్తారని అంచనా వేసింది. హెల్మెట్ పెట్టుకుంటే దాదాపు 70 శాతం బతికి బయటపడే అవకాశం ఉంటుందని పేర్కొంది.
2018లో ఇండియాలో జరిగిన వివిధ ప్రమాదాల్లో దాదాపు 1,50,000 మంది మరణించారు. దాదాపు 3,50,000 మంది గాయపడ్డారు. ప్రమాదాల్లో చనిపోతున్న వారిలో కార్లలో ప్రయాణించేవారి కంటే ద్విచక్ర వాహనదారుల మరణాలు 26 రెట్లు అధికంగా ఉన్నాయట. ఇండియాలో గల వాహనాల్లో 80 శాతం టూవీలర్లే, ప్రమాదాలతో పోల్చితే మన దేశంలో అత్యధిక శాతం మంది మరణించడానికి కారణం హెల్మెట్ ధరించకపోవడమే. అయితే, రానున్న రోజుల్లో వీటి సంఖ్య తగ్గాలంటే అందరూ తప్పకుండా హెల్మెట్ ధరించాల్సిందే అని ఆర్మూర్ డివిజన్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వివేకానంద రెడ్డి గుర్రం హెచ్ టీవీ న్యూస్ ప్రతినిధితో తెలియజేస్తూ ప్రతి ఒక్క పౌరుని బాధ్యత తమపైనే ఉందని రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ఉంటే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయని ఆయన తెలపడం జరిగింది.
