సేయింట్ పౌల్స్ హై స్కూల్ లో చిన్నారుల ప్రతిభ ప్రదర్శన

HTV న్యూస్: 11-మార్చి-2026, ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి లోగల సేయింట్ పౌల్స్ హై స్కూల్ నందు ప్రీ–ప్రైమరీ విభాగం “బ్రైట్ బిగినింగ్స్” ఆధ్వర్యంలో ఈ రోజు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని వివిధ కార్యక్రమాల ద్వారా తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ క్యాథెరిన సంతోష్ పాల్, వైస్ ప్రిన్సిపాల్ సీసీలియా ఎనోక్ పాల్ మరియు కరెస్పాండంట్ అడ్వకేట్ ఎనోక్ పాల్ పాల్గొని ఈ సందర్భంగా ప్రతి చిన్నారికి వారి మొత్తం ప్రదర్శన, ఆత్మవిశ్వాసం మరియు వ్యక్తిత్వాన్ని గుర్తించి ప్రత్యేక టైటిళ్లతో సత్కరించారు. ఈ కార్యక్రమం చిన్నారుల సమగ్ర అభివృద్ధికి ప్రాథమిక విద్య ఎంత ముఖ్యమో తెలియజేసింది. తల్లిదండ్రులు కార్యక్రమాన్ని ఎంతో అభినందిస్తూ, చిన్నారులను ప్రోత్సహించిన ఉపాధ్యాయుల కృషిని ప్రశంసించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *