హెచ్ టీవీ న్యూస్ ఆర్మూర్ ప్రతినిధి జూలై 20 (ఆర్మూర్): ‘వెహికిల్ ఇన్సూరెన్సు’ చట్ట ప్రకారం రోడ్డు పై వెళ్ళే ప్రతి వెహికిల్స్కి తప్పని సరిగా థర్డ్ పార్టీ/ లయబిలిటీ/ ఆర్ట్ ఇన్సూరెస్సు ఉండి. తీరాలి. ఈ ఇన్సూరెన్సు వలన వెహికిల్ వలన నష్టపోయిన వారికి కోర్టు ద్వారా నష్టపరిహారం వస్తుంది. దాని వలన వెహికిల్ యజమాని, వెహికిల్ వలన నష్టపోయిన వారికి ఆర్థిక నష్టం వాటిల్లను.:
ఒక ఆటోలో నిబంధనల ప్రకారం ముగ్గురు మాత్రమే ఉండాలి. కానీ 8 మంది ప్రయాణీకులు వున్నారు. ఆ ఆటోకి ఇన్సూరెన్స్ లేదు. ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం వలన ఆటో ఒక చెట్టుకి గుద్దుకుని ఆటోలో వున్న నలుగురు ప్రయాణీకులు అక్కడికక్కడే చనిపోయారు. మిగిలిన వారికి గట్టిగా దెబ్బలు తగిలాయి ఆటో డ్రైవర్ కూడా మరణించాడు. ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల ఎవరికి నష్టపరిహారం రాలేదు. ఆ ఆటో డ్రైవర్ కుటుంబంతోబాటు అందులో ప్రయాణం చేస్తున్న వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఎందుకంటే వారందరివి రెక్క అడితేకాని డొక్కాడని బ్రతుకులు
ఇలా చెప్పుకుంటే చాలా విషయాలు ఉంటాయి. చాలా మందికి అసలు ఇన్సూరెన్సు అంటే అవగాహన లేదు, ఇన్సూరెన్సు అనేది ఎంత ముఖ్యమైనదో, దాని ప్రాధాన్యం ఏంటో తెలియదు ఇన్ఫూరెన్సు అనేది ఒక సామాజిక బాధ్యత, ఆ వెహికిల్ యజమానికి, కుటుంబానికి అత్యంత భద్రత.
ఇన్సూరెన్స్ , డ్రైవింగ్ లైసెన్స్, సర్టిఫికేట్ అఫ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, వర్శల్ లేకపోవడం, ఎక్కడైనా అధికారులు కనపడితే బండి వెనుకకు తిప్పడం, లేదా బ్రతిమిలాడి బయటపడడం, భయంగా రోడ్డుపై తిరగడం, ఎందుకు భాద, అన్ని డాక్కుమెట్టు వుండి తిరగటులో మానసిక ధైర్యం ఎంత భరోసా ఉంటుందో కదా.
వెహికిల్ ఇన్స్యూరెన్స్ 3 రకాలు: మీరు ఒక వాహనాన్ని కొన్నారు మీకు షోరూంలోనే మీ వాహనానికి కిల్ ఇన్సూరెన్స్ పాలసీ ఇస్తారు. దాని గురించి మీరు క్షుణ్ణంగా తెలుసుకోవాలి.
థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్: ఎ) ఈ పాలసీ లో వెహికల్ ఓనర్ కి డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే పర్సనల్ ఆక్సిడెంట్ కవర్ ఇస్తారు .బి) ఈ వాహానం వలన వ్యక్తులకి జంతువులకి జరిగే ప్రమాదాలకు నష్టపరిహారం కోర్టు ద్వారా చెల్లిస్తారు. సి) ఆస్తినష్టం జరిగితే నష్టపరిహారం కోర్టు ద్వారా చెల్లిస్తారు.
డి)వాహన డ్రైవర్ ప్రమాదంలో చనిపోయిన. అవయవ సష్టం జరిగిన, వైద్య ఖర్చులు జరిగినా, వాటికి నష్టపరిహారం కోర్టు ద్వారా చెల్లిస్తారు.
ఇ) పాసింజర్ వెహికిల్ (బస్సు, ఆటో, టాక్సీ! అయితే వాటిలో ప్రయాణం చేసే వారికి, చనిపోయిన, అవయవ నష్టం జరిగినా, వైద్య ఖర్చులు జరిగినా వాటికి నష్ట పరిహారం కోర్టు ద్వారా చెల్లిస్తారు.
మోటార్ వాహన చట్టం ప్రకారం ప్రతి వాహనానికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి. మారిన చట్టం ప్రకారం ఇన్సూరెన్స్ లేకుండా మొదటిసారి వాహనం పట్టుబడినట్లయితే మూడు నెలల జైలు శిక్ష లేదా రెండు వేల రూపాయల జరిమానా లేదా రెండు విధించవచ్చు. రెండవసారి ఇన్సూరెన్స్ లేకుండా వాహనం పట్టుపడితే మూడు నెలల జైలు శిక్ష లేదా నాలుగు వేల రూపాయల జరిమానా లేదా రెండు విధించవచ్చు. కాబట్టి ఈ రోజే మీ వాహనానికి ఇన్సూరెన్స్ ఉన్నదా లేదా తనిఖీ చేసుకోండి లేనట్లయితే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి అని ఆర్మూర్ డివిజన్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వివేకానంద రెడ్డి గుర్రం హెచ్ టీవీ న్యూస్ ప్రతినిధితో తెలియజేస్తూ ప్రతి ఒక్క పౌరుని బాధ్యత తమపైనే ఉందని రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ఉంటే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయని ఆయన తెలపడం జరిగింది.
