నిజామాబాద్ HTV NEWS
ఆర్మూర్, నవంబర్17/11/2023
ఆర్మూర్ మండల కేంద్రంలోని వెంకటేశ్వర కాలనీలో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వినయ్ కుమార్ రెడ్డి సతీమణి అనన్య రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని, కుటుంబంలోని ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటేసి పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని, వెంకటేశ్వర కాలనీ ఆడపడుచులను కోరారు. ఆమెతోపాటు మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు.
