ఆర్ సి రెడ్డి హెచ్ టి వి రిపోర్టర్ సిరికొండ, జనవరి 01, HTV News: సిరికొండ మండలం చిన్న వాల్గొట్ గ్రామంలో సోమవారం రోజున అయోధ్య నుండి రాములవారి అక్షింతలు ప్రతి ఇంటికి వాటిని భక్తులు పంపిణీ చేశారు ముందుగా మహిళలు మంగళ హారతులకు స్వాగతం పలికి అక్షింతలు స్వీకరించారు. పూజితక్షింతలను ఇంటిలో ఉన్న కొద్దిపాటి బియ్యం లో కలుపుకొని వాటిని రాములవారి పాదాల వద్ద ఉంచుకోవాలని తెలపడంతో మహిళలు మంగళహాతులతో స్వాగతించారు. ఈ కార్యక్రమంలో ప్రేమ్ కుమార్ జనార్ధన్ భూమారెడ్డి సాగర్ రెడ్డి సదానంద్ విజయ్ పులి రాము యువకులు తదితరులు పాల్గొన్నారు.
