గణతంత్ర దినోత్సవ వేడుకల్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటం ప్రదర్శించాలి ‘ఎరవెల్లి జగన్’

జనవరి 25 HTV NEWS

తెలంగాణ యూనివర్సిటీస్ ఐక్య కార్యాచరణ కమిటీ రాష్ట్ర చైర్మన్, డి. ఎస్. ఎఫ్ వ్యవస్థాపకులు ఎరవెల్లి జగన్.
ఈనెల 26న దేశవ్యాప్తంగా నిర్వహించిన గణతంత్ర దినోత్సవంలో తెలంగాణలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలలో, ప్రతి కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటం ప్రదర్శించాలని తెలంగాణ యూనివర్సిటీస్ ఐక్య కార్యాచరణ కమిటీ, రాష్ట్ర చైర్మన్ డిఎస్ఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎరవెల్లి జగన్ పిలుపు నిచ్చారు.జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీ హైదరా బాద్ క్యాంపస్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎరవెల్లి జగన్ మాట్లాడుతూ స్వతంత్ర గణతంత్ర దినోత్స వలలో చాలా ప్రభుత్వ ప్రైవేటు కార్యాల యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటం లేకుండా నిర్వహించడం బాధాకరమ న్నారు. అదే విధంగా దేశంలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం రాజ్యాంగంలో ఎన్నో రకాల హక్కులు పొందుపరి చారన్నారు. అలాంటి అంబేద్కర్ ను విస్మరించి ఉత్సవాలు జరుపుకోవడం సిగ్గుచేటు అన్నారు. ఇప్పటి కైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రపంచ మేధావిగా గుర్తించబడ్డ అంబేద్కర్ చిత్రపటం ప్రతి స్వతంత్ర, గణతంత్ర దినోత్సవంలో సందర్భంగా ఆయా కార్యాల్లో ప్రదర్శించే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమం లో తెలంగాణ యూనివర్సిటీస్ ఐక్య కార్యాచరణ కమిటీ, డిప్లొమా స్టూడెంట్ ఫెడరేషన్ (DSF) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వివేక్ పటేల్, రాష్ట్ర అధ్యక్షురాలు చింతల అఖిల సోను, JNTUH యూనివర్సిటీ ఇంచార్జ్ అభిషేక్, టేకుమల్ల ప్రదీప్, రేవంత్ నాయక్, జ్యోతి, అభిజ్ఞ, రవళి, హెప్సిబా, బ్యూల, వెన్నెల రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *