ఎస్సై ప్రదీప్ కు ఘన సన్మానం..💐

కోండ్లెo సాయిరాం హెచ్ టీవీ రిపోర్టర్ ముప్కాల్ మండల కేంద్రం ఫిబ్రవరి 6 HTV News: ముప్కాల్ మండల కేంద్రంలో నిర్మితమౌతున్న ఇండోర్ స్టేడియం కోరకు స్థానిక మండల కేంద్రానికి చెందిన సీనియర్ కబడ్డీ క్రీడాకారులు ‘రిజర్వుడ్’ (ఆర్ఐ) ఎస్ఐ ప్రదీప్ తనవంతు సాయంగా రూ.50 వేల రూపాయలను మంగళవారం రోజు క్రీడా నిర్మాణ భాద్యులకు అందజేశారు.ఈ సందర్భంగా విరాళ దాత అయిన ప్రదీప్ ను నిర్మాణ భాద్యులు, పలువురు క్రీడాకారులు, గ్రామ పెద్దలు ఘనంగా సన్మానించారు. అనంతరం జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కె.గంగాధర్ మాట్లాడుతూ ఇండోర్ స్టేడియం నిర్మాణం కోరకు పలువురు ప్రముఖులు, దాతలు ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కె.గంగాధర్, రిటైర్డ్ ఉద్యోగస్తులు నునుగొండ అంజయ్య, పీడీ.రాజ్ కుమార్, పుష్పానాథ్ రెడ్డి, టి.సాయన్న, మోతే గంగారెడ్డి, కనకయ్య గౌడ్, నరేష్, హరీష్ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *