చదువు క్రమశిక్షణనే విజయానికి సోపానాలు

ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు లాబిశెట్టి మహేష్

ఆర్సి సి రెడ్డి ఎచ్ టీవీ రిపోర్టర్ , సిరికొండ ఫిబ్రవరి 08, HTV News: జీవితంలో ఆటుపోట్లు సహజమని, గెలుపోటములు తట్టుకోవాలని, ప్రపంచానికి మనల్ని పరిచయం చేసేది మన చదువు నిజమేనని, చదువు క్రమశిక్షణ విజయానికి సోపానాలని, ప్రఖ్యాత వ్యక్తిత్వ నిపుణులు లాభిశెట్టి మహేష్ అన్నారు.గురువారం సత్యశోధక్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు నిర్వహించిన విజయీభవ “ది టానిక్ టాక్ ఫర్ ఫైయింగ్ వింగ్స్” ప్రేరణ కార్యక్రమానికి పాఠశాల ప్రిన్సిపాల్ ఆర్. నర్సయ్య అధ్యక్షత వహించగా ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు లాఖిశెట్టి మహేష్, విజ్జా మహేంధర్, సలవడి వెంకటేశ్ లు అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ…. జీవితం అనేది కుటుంబ పరిస్థితులకు, వ్యక్తిగత సమస్యలను క్రోడీకరించి ఆటంకం కలగకుండా ఏ స్థాయికి చేరామనేది సమాజానికి పరిచయం చేస్తే అది నీ విజయం అన్నారు. విజ్జా మహేంధర్ మాట్లాడుతూ…. తల్లిదండ్రుల కష్టాన్ని ఉపాధ్యాయుల ఆశలను గుర్తించి విద్యార్థి దశ నుండియే సాధన చేసి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. జీవితం అనేది అందమైన పూలవనం లాంటిదని దానిని మలచుకోవడంలో ప్రతి ఒక్కరు తోటమాలి పాత్రను పోషించాలన్నారు. అంతర్లీనంగా నిగూఢమైన ప్రతిభ, శక్తిని గుర్తించి కఠోరసాధన చేస్తే అసాధ్యాలు సుసాధ్యాలు అవుతాయన్నారు. జీవితంలో గొప్ప గొప్ప విజయాలు సాధించినవారి జీవిత ఇతిహాసాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పయనించాలన్నారు. సలవడి వెంకటేష్ మాట్లాడుతూ… నిత్యనూతనంతో చైతన్యంగా ఉండాలని, మంచివైపు ఎదుగుదలవైపు ఎవరు ప్రోత్సహిస్తున్నారో గుర్తించి వారితో స్నేహం చేయాలన్నారు. చిన్నతనం నుండియే సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవాలని మార్పు అనేది ప్రతి ఒక్కరిలో రావాలని ప్రపంచాన్ని మార్చే శక్తి అత్యంత శక్తి వనరులైన యువత, విద్యార్థులేనన్నారు. ఓటమిని విజయానికి బాటలుగా మలుచుకొని భవిష్యత్తులో ఇతరులకు మార్గదర్శకంగా ఉండే స్థాయికి చేరుకోవాలని పదవతరగతిలో మంచి ఫలితాలు సాధించి కన్న తల్లిదండ్రుల కళ్ళలో కాంతులు చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో స్కౌట్స్ & గైడ్స్ సెక్రటరీ సాల్మన్, ఉ పాధ్యాయ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొననైనది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *