ముప్కాల్ లో ఘనంగా సంత్ రవిదాస్ 647వ జన్మదిన వేడుకలు

కోండ్లెo సాయిరాం హెచ్ టి వి రిపోర్టర్ ముప్కాల్ మండల కేంద్రం ఫిబ్రవరి 24 శనివారం, HTV News : ముప్కాల్ మండల కేంద్రంలో మోచిల ఆరాధ్య దైవమైన సంతు రవి దాస్ వేడుకలను మోచి సంఘం ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. అనంతరం సంత్ రవిదాస్ చిత్రపటానికి పూలమాలలు వేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలంగాణ రాష్ట్రం మోచి సంఘ ముఖ్య సలహాదారులు ఓటరికరి రమేష్ మాట్లాడుతూ సంత రవిదాస్ 14వ శతాబ్దం చివరిలో భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ లోని గోవర్ధన్ పూర్ గ్రామంలో జన్మించారు అతను అంటరానివారిగా పరిగణించబడే తక్కువ కుల కుటుంబంలో జన్మించారుభారతీయులందరికీ ప్రాథమిక మానవ హక్కుల సమితి ఉండాలని వాదించిన మొదటి వ్యక్తుల్లో గురు రవిదాస్ ఒకరుఅతను భక్తి ఉద్యమంలో ప్రముఖ వ్యక్తి అయ్యాడు మరియు ఆధ్యాత్మికత ను బోధించాడు అని ఆయన తెలియజేశారుముప్కాల్ మండల పట్టణ అధ్యక్షుడు కార్యదర్శి కోండ్లేo కిరణ్ కుమార్ మాట్లాడుతూ భారతీయులందరూ ప్రాథమిక మానవ హక్కుల సమితి ఉండాలని వాదించిన మొదటి వ్యక్తుల్లో గురు రవిదాస్ ఒకరు అతను భక్తి ఉద్యమంలో ప్రముఖ వ్యక్తి అయ్యాడు మరియు ఆధ్యాత్మికత ను బోధించాడు భారతీయ కుల వ్యవస్థ యొక్క అణచివేత నుండి స్వేచ్ఛ ఆధారంగా సమానత్వ సందేశాన్ని ముందుకు తీసుకురావడానికి ప్రయత్నించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కిరణ్ కుమార్, సాయిలు, రాజన్న, పోశెట్టి, రాజేందర్, దిలీప్, సాగర్, సందీప్, రాజశేఖర్, భూమేశ్వర్, నాగరాజు, రవి, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *