ఆర్ సి రెడ్డి హెచ్ టీవీ రిపోర్టర్ సిరికొండ ఫిబ్రవరి 26, HTV News: సిరికొండ మండలంలోని హుస్సేన్ నగర్ గ్రామంలో సోమవారం రోజున వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా భూగర్భ జలాలు అట్టంటకపోయి, బోర్లు నీళ్లు పోయాక వేసిన పొలాలన్నీ ఎండిపోయిన వరి పంట పొలాలను పరిశీలించారు. ఈ క్షేత్రస్థాయి పరిశీలనలో మండల అధికారి ఏవో జే వెంకటేష్, సహాయ వ్యవసాయ సంచాలకులు ప్రదీప్ కుమార్, రైతులు మోతే మనోహర్,రాజేశ్వర్,సంతోష్ రెడ్డి, దుమాల రాజు రెడ్డి, ఏఈఓ కృష్ణారెడ్డి పాల్గొన్నారు
