భీంగల్, ఏప్రిల్ 6 శనివారం HTV న్యూస్ :
భీంగల్ మున్సిపాలిటీ పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 1952 ఏప్రిల్ 6 వ తేదీన అప్పటి జాతీయ ఉద్యమ నేత మాజీ కేంద్రమంత్రి అయిన శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఏర్పాటు చేశారు. ఈనాటికి దిగ్విజయంగా 72 ఏళ్ళు పూర్తి చేసుకుని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 6న పార్టీ ఆవిర్భవ దినోత్సవ సందర్భంగా భారతదేశంలోని ప్రతి బూత్ స్థాయిలో పార్టీ జెండాను ఆవిష్కరించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు భీంగల్ పట్టణంలో పార్టీ జెండాను పట్టణ అధ్యక్షులు యోగేశ్వర్ నర్సయ్య ఎగరవేయటం జరిగింది. వచ్చే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీని భారీ మెజార్టీతో గెలిపించే బాధ్యత కార్యకర్తలపై ఉందని పట్టణ అధ్యక్షుడు యోగేశ్వర్ నరసయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు బండారి లక్ష్మణ్ గౌడ్, సంధ్య రాజు, ప్రధాన కార్యదర్శి ఉప్పల నవీన్ ,నరేందర్ గౌడ్ ,పతాని ప్రవీణ్, దడివి లక్ష్మీనారాయణ, రాగి అజయ్ ,నామాల వెంకటేశ్వర్, నీలం గంగాధర్ ,సుజిన్ తదితరులు పాల్గొనడం జరిగింది.
