కాంగ్రెస్ అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్ నామినేషన్

భీంగల్ నవంబర్ 9 HTV న్యూస్ :

బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్ నామినేషన్ వేయడానికి ముందు సవెల్, మెండోరా గ్రామంలోని హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు సతీసమేతంగా నిర్వహించి భారీ ర్యాలీతో మోర్తాడ్ నుండి బయలుదేరి భీంగల్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయమునకు చేరుకుని అక్కడినుండి భారీ ర్యాలీతో భీంగల్ నామినేషన్ కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి చిత్రమిశ్రా గారికి అందజేశారు. భీంగల్ సుభాష్ నగర్ లో బాల్కొండ నియోజకవర్గం అధ్యక్షుడు ఆరెపల్లి నాగేందర్ బాబు గజమాలతో ముత్యాల సునీల్ రెడ్డి నీ సత్కరించారు అక్కడినుండి ర్యాలీప్రారంభించారు.
ర్యాలీలో బాల్కొండ నియోజకవర్గం పలు గ్రామాల నుండి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. యువకులు కాంగ్రెస్ పార్టీ జెండాలను పట్టుకొని సందడి చేశారు. అధిక సంఖ్యలోమహిళలు, యువకులు ర్యాలీలో పాల్గొన్నారు. అక్కడి నుండి ర్యాలీ బ్యాండ్ మేళాలతో మొదలుకొని అంగడి బజార్, నంది గల్లీ మీదుగా ముచ్కూర్ చౌరస్తా వరకు సాగింది. అక్కడముత్యాల సునీల్ కుమార్ ప్రజలను ఉద్దేశిస్తూ ప్రసంగించారు. ప్రసంగంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు కచ్చితంగా నెరవేరుస్తామని ప్రజలకు చెప్పడం జరిగింది. ఎన్నికలలో భారీ మెజార్టీతో తనను గెలిపించమని ప్రజలను కోరడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మాజీ బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గం అధ్యక్షుడు ఆరేపల్లి నాగేందర్ బాబు, భీంగల్ పట్టణ అధ్యక్షుడు నిచ్చ మల్ల మహేష్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కంకణాల వంశీ, విగ్నేష్, చందు, ప్రసూన్, మనోజ్, దినేష్, మధుబాబు, శ్యామ్, తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *