కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏకకాలంలో 2లక్షల రుణమాఫీ చేస్తాం.

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్.

మోర్తాడ్ నవంబర్ 9 HTV న్యూస్: మోర్తాడ్ మండలం లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తిమ్మాపూర్, పాలే0, గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్ గారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ముత్యాల సునీల్ కుమార్ గారు మాట్లాడుతూ తొమ్మిదిన్నర ఏళ్ల పాలనలో టిఆర్ఎస్ పార్టీ మంత్రి ప్రశాంత్ రెడ్డి బాల్కొండ ప్రజలను నిలువు దోపిడీ చేశారని ఒకే కాంటాక్టర్ ను పెట్టుకొని కోట్ల రూపాయల దోపిడీ చేశారని అన్నారు.
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కి ఒక అవకాశం ఇవ్వాలని తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని పంట పెట్టుబడి సహాయం కింద ఎకరానికి ప్రతి సంవత్సరానికి 15000 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తామని తెలిపారు.
భూమిలేని రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 సాయం అందిస్తామని తెలిపారు.
మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళ ఖాతాలో ప్రతినెల 2500 రూపాయలు జమ చేస్తామని తెలిపారు. ఆర్టీసి
బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తామని తెలిపారు.
నియోజకవర్గంలో అహంకారాన్ని అంతమొందించి ప్రేమను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఒక్కసారి అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించాలని నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం కల్పించాలని కోరారు.
కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *