-సిరికొండ మండల విద్యాధికారి యం. శ్రీనివాస్
ఆర్ సి రెడ్డి హెచ్ టీవీ రిపోర్టర్ సిరికొండ జనవరి 11, HTV News: దీన్ దాయల్ స్పార్శ్ యోజన’ జనరల్ నాలెడ్జ్ పోటీ పరీక్షలో ప్రతిభ కనబరిచి ప్రాజెక్ట్ లెవెల్ ఎంపికైన సత్యశోధక్ విద్యార్థులను మండల విద్యాధికారి ఎం శ్రీనివాస్ గురువారం పాఠశాల ప్రాంగణంలో అభినందించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ….నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకొని సృజనాత్మకతను పెంపొందించుకోవాలని ఆయన అన్నారు. సిరికొండ జాతీయ తపాలాశాఖ తరపున గత సంవత్సరం అక్టోబర్ మాసంలో నిర్వహించిన పిలాటలి ఉపకారవేతనాల కొరకు పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థులు బి. భవ్యశ్రీ, పి. నవ్యశ్రీ, పి. సిద్దార్థ, కె. రోహిత్, ఎ. శ్రీకాంత్, 6వ తరగతి విద్యార్థులు బి. నిధిరెడ్డి, యం. వర్షిత లు ఎంపికైనారు. వీరు మహాత్మాగాంధీ, కమ్యూనికేషన్ అభివృద్ధి, ఇస్రో, భారత స్వాతంత్రోద్యమం, భారతదేశ రక్షణలో సైనికుల పాత్ర మొదలగు అంశాలపైన తపాలా శాఖ ముద్రించిన స్టాంపులను సేకరించి వాటి ప్రాముఖ్యతను తెలుపుతూ రూపొందించిన ప్రాజెక్ట్ లను మండల విద్యాధికారి యం. శ్రీనివాస్ పరిశీలించారు.అనంతరం విద్యార్థులకు ప్రత్యేక జ్ఞాపికలను అందించి ప్రశంశించారు. విద్యార్థులు తపాలా సంస్థ ద్వారా ప్రయోజనాలను తెలుసుకొని సద్వినియోగం పరుచుకోవాలని, చదువుతో పాటు సామాజిక అవగాహనను కలిగివుండాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఆర్. నర్సయ్య పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
