లాల్ బహదూర్ శాస్త్రి 58 వ వర్ధంతి

ఆర్ సి రెడ్డి హెచ్ టివి రిపోర్టర్ సిరికొండ జనవరి 11, HTV News: మండల కేంద్రంలోని సత్యశోధక్ పాఠశాలలో భారత మాజీ ప్రధాని భారతరత్న లాల్ బహాదూర్ శాస్త్రి 58వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ముందుగా సత్యశోదక్ ప్రిన్సిపాల్ ఆర్ నరసయ్య లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాలనలంకరించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు, జాతి సంక్షేమం కోసం నిరంతరం తపిస్తూ, నిరాడంబరంగా జీవిస్తూ ఉన్నతమైన నాయకత్వంతో క్లిష్ట సమయాల్లో తనదైన చతురతతో జాతిని నడిపించిన నిస్వార్త ప్రజాసేవకుడు లాల్ బహదూర్ శాస్త్రి అని కొనియాడారు. భారతదేశ ఆత్మ పల్లెలోనె ఉంటుందని, మన దేశం బాగుండాలి అంటే జవాను బాగుండాలని మనం బాగుండాలి అంటే రైతు చల్లగా ఉండాలని జై జవాన్, జై కిసాన్ అని ఆయనిచ్చిన పిలుపు నేటికి ప్రతిద్వనిస్తుందని అన్నారు. సుదీర్ఘకాలం ఉద్యమాలలో రాజకీయ జీవితాలలో ఉన్నా నిరాడంబరమైన రాజకీయ జీవితం గడిపిన శాస్త్రి నేటితరం నాయకులకు స్పూర్తి కావాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొననైనది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *